బెజవాడకు చుక్కలు చూపిస్తున్న కరోనా…!

-

ఎప్పుడు రాజకీయాలతో, వ్యాపారాలతో సందడి సందడిగా ఉండే విజయవాడలో ఇప్పుడు కరోనా రాజ్యం నడుస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా అక్కడ వేగంగా వ్యాపించడం తో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అనేది వాస్తవం. విజయవాడ నగరంలో 150 కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

నిన్న ఒక్క రోజే 40 పైగా కేసులు నమోదు అయ్యాయి. వేలాది మంది క్వారంటైన్ లో ఉన్నారు. పేకాట ఆడటంతో మొత్తం 40 మంది వరకు కరోనా సోకింది. కృష్ణ లంక, కార్మిక నగర్ లో కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కృష్ణ లంక ప్రాంతంలో 27 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 177 పాజిటివ్‌ కేసులు రాగా అందులో 150 కేసులు బెజవాడ లోనే నమోదు అయ్యాయి.

జిల్లాలో ఆదివారం 52 కేసులు రాగా వాటిలో 47 విజయవాడ కేసులు. విజయవాడలోని 150 పాజిటివ్ కేసుల్లో… 60 కేసులకు ఇద్దరే కారణం అయ్యారని, మరో 40 మంది ఢిల్లీ నుంచి వచ్చారని, మరో 41 కేసులకు దిల్లీ లింక్ లు ఉన్నాయని అధికారులు చెప్పారు. మాచవరం కార్మికనగర్‌కు చెందిన ఒక యువకుడి నుంచి 36 మందికి కరోనా వచ్చింది. ఆదివారం వచ్చిన కేసుల్లో నమోదైన 47 కేసుల్లో కార్మికనగర్‌లో 20, కృష్ణలంకలో 7, గాంధీనగర్‌లో 5, మధురానగర్‌లో 4 ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

25 కేసులు పాల ప్యాకెట్లు, కూరగాయలు, నిత్యావసరాలు కొనేందుకు బయటకు వెళ్లి వచ్చిన వారికి వచ్చాయని అధికారులు చెప్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి, ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచి, కరోనా వైరస్ బయటపడింది. కృష్ణా జిల్లాలో మొత్తం కరోనా కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news