అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్.. చైనాలో అంతర్భాగమని పేర్కొంది. తమ భూభాగంలోనే అరుణాచల్ ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. అందుకే అరుణాచల్‌లోని 11 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు పెట్టిందని చెప్పారు.
‘జాంగ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్) చైనా భూభాగంలో ఉంది. జాంగ్నాన్పై సార్వభౌమాధికారం చైనాదే. స్టేట్ కౌన్సిల్ భౌగోళిక నిబంధనల ప్రకారమే అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టాం.’ అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు.
భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు చైనా పేర్లు మార్చడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ విషయంతో భారత్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌లో అంతర్భాగమని అమెరికా గుర్తించిందని తెలిపింది.