ప్రపంచ నాయకులారా రండి..ఉక్రెయిన్ ని ఆదుకుందాం: ప్రియాంక చోప్రా

-

ప్రపంచ నేతల రా రండి ఉక్రెయిన్ ని ఆదుకుందాం అంటూ ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు.ఉక్రెయిన్ లో రష్యా దాడుల వల్ల అత్యంత దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయని, లక్షల మంది శరణార్థులు, చిన్నారులిపై చలించిపోయిన ప్రియాంక చోప్రా ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు.యూనిసెఫ్ సౌహార్ద రాయబార హోదాలో ఆమె అంతర్జాతీయ నేతలకు పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో పిల్లలు చెల్లాచెదురు అవుతున్నారని, ఉక్రెయిన్ శరణార్ధులను ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.” ప్రపంచ నాయకులారా..మనం ఇక ఎంత మాత్రం చూస్తూ ఊరుకోలేము..శరణార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వస్తారా” అంటూ ప్రియాంక చోప్రా ఓ వీడియో సందేశం వెలువరించారు.

ఈ మేరకు ప్రపంచ స్థాయిలో విరాళాల కోసం అభ్యర్ధన చేశారు. స్పందించే దాతల కోసం యూనిట్స్పందించే దాతల కోసం యూనిసేఫ్ విరాలాల లింక్ ను కూడా పొందుపరిచారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం అత్యంత దయనీయ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.రష్యా సేనల నుండి ప్రాణాలు కాపాడుకోవడం ఒక ఎత్తయితే, ఆకలి, నిత్యవసర శరణార్ధుల సమస్యలు మరో ఎత్తుగా కనిపిస్తున్నాయి అన్నారు ప్రియాంక చోప్రా.

Read more RELATED
Recommended to you

Latest news