బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్.. అధ్యక్షుడికి తగ్గుతున్న మద్దతు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీ నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ నామినీ జో బైడెన్ వైదొలగాలన్న డిమాండ్లు బలపడుతున్నాయి. సొంత పార్టీలోని కీలక ప్రతినిధులే ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచినవారూ ఉన్నారని సమాచారం.

ట్రంప్‌తో డిబేట్తో బైడెన్‌ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్‌ పోటీలో ఉండొద్దని పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఆయన వల్ల అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ట్రంప్‌ నుంచి దేశాన్ని రక్షించాలంటే బలమైన నేతను బరిలో నిలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బైడెన్‌ వైదొలగితే కమలా హ్యారిస్‌ను పోటీలో ఉంచాలని చాలా మంది నేతలు అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె బరిలో ఉంటే ట్రంప్‌ను ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news