టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై మరోసారి సంచలన ఆరోపణలు వచ్చాయి. తన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ తాజా కథనంలో ఆరోపించింది. ఇంటర్న్‌షిప్ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ గతంలో ఎలాన్ మస్క్ కంపెనీలో పనిచేసి వెళ్లిపోయిన మహిళల నుంచి వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ వివరాలు సేకరించినట్లు సమాచారం.
మస్క్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, అప్పుడప్పుడు బోర్డ్ సభ్యులతో కలిసి వాటిని తీసుకునేవారని ఈ కథనం పేర్కొంది. తన పిల్లలకు తల్లి కావాలని ఓ ఉద్యోగినిని ఆయన కోరినట్లు తెలిపింది. తనతో గడిపితే గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని 2016లో మస్క్ చెప్పినట్లు మరో మహిళ చెప్పినట్లు వివరించింది. స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ స్పందిస్తూ మస్క్‌పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.