అల్లూరి జిల్లాలో విషాదం..చెరువులో పడి అక్కాచెల్లెల్లు మృతి…కాలకృత్యలకు వెళ్లి !

-

అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి అక్కాచెల్లెల్లు మృతి చెందారు. ఈ సంఘటన అల్లూరి జిల్లా అడ్డతీగల (మం), సోమన్న పాలెం గ్రామంలో జరిగింది. కాలకృత్యలకు వెళ్లి ప్రమాదావశాత్తు చెరువులో పడి మృతి చెందారు ఇద్దరు అక్కాచెల్లెల్లు.

Sister died after falling into the pond

అయితే.. ముందుగా ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రామారావు శ్రీలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు కుమార్తెలను గ్రామస్తుల సాయంతో చెరువులో నుంచి బయటకు తీసుకురాగా అప్పటికే పెద్ద కుమార్తె మరణించింది.

కొన ఊపిరితో ఉన్న రెండో కుమార్తెను కాపాడేందుకు హుటాహుటిన అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా ఆ చిన్నారి కూడా మార్గమధ్యలో మృత్యువాత పడింది. మృతులు వంతల కావ్యశ్రీ (13),సాహితీ (10) గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news