వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి: రేవంత్ రెడ్డి

-

వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త తదితరులు సీఎం వెంట ఉన్నారు.

cm revanth reddy orders telangana dgp

వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు సీఎం రేవంత్‌.ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానం అనుసరించాలని, సిబ్బంది కొరత ఉంటే హోమ్ గార్డులను రిక్రూట్‌ చేసుకోవాలని చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని, ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. నగరంలో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు వివరించగా, వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news