ఇకపై పర్మినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఫేస్ బుక్.

దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్, తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులందరూ ఇంటి నుండే పనులు చేస్తున్నారని తెలిసిందే. తాజాగా ఇకపై పర్మినెంట్ గా ఇంటి నుండే పనులు చేయవచ్చని తెలిపింది. ఆఫీసులు తెరుచుకున్నా కూడా ఇంటి వద్ద నుండే పనులు చేసుకోవచ్చని, కంపెనీకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. పని ఎక్కడ చేస్తున్నావనేది ముఖ్యం కాదని, ఎలా చేస్తున్నావనేదే ముఖ్యం అని, అందువల్ల ఇంటి దగ్గర ఉండి పనులు చేసుకోవచ్చని వెల్లడి చేసింది.

రిమోట్ వర్క్ పాలసీలో భాగంగా ఈ మార్పులను తీసుకువచ్చింది. ఉద్యోగికి ఎక్కడ సౌలభ్యంగా ఉంటే అక్కడే పనులు నిర్వహించవచ్చని, ఈ విషయంలో ఫేస్ బుక్ సంస్థ ఎలాంటి ఒత్తిడి చేయబోదని పేర్కొంది. ఈ బంపర్ ఆఫర్ తో ఫేస్ బుక్ ఉద్యోగులు సంతోషంలో మునిగిపోయారు. దీనివల్ల పనిలోనాణ్యత మరింత పెరుగుతుందని అంటున్నారు.