మీ రోగనిరోధక శక్తిని బలహీనపర్చే ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు..

-

కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ మూడవ వేవ్ విషయంలో భయం కొనసాగుతూనే ఉంది. అందుకే వ్యాక్సినేషన్ తో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలు డైట్ లో చేర్చుకుని రోగనిరోధక శక్తి (Immunity Power)ని పెంచుకోవాలని చూస్తున్నారు. ఐతే మీకిది తెలుసా? మీరు తీసుకునే కొన్ని ఆహారాలు రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపి దాన్ని బలహీనపరుస్తాయి. ఈ కరోనా టైమ్ లో అలాంటి ఆహారాలను ముట్టుకోకుండా ఉంటేనే బెటర్.

 రోగనిరోధక శక్తి | Immunity Power

ఆ ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చక్కెర

చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్ళవద్దు. శరీరంలో చక్కెర శాతం పెరిగితే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాల జోలికి వెళ్ళవద్దు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ముట్టకపోవడమే మంచిది.

ఉప్పు

ప్యాకేజ్ చిప్స్, బేకరీ వస్తువులు ఉప్పుతో లోడ్ చేయబడతాయి. ఇది శరీరంలో బాగా ప్రభావం చూపుతుంది. శరీరంలో ఉప్పు శాతం పెరుగుతుంటే అనేక ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తపొటు పెరిగి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉపయోగించకండి.

వేయించిన ఆహారాలు

వేయించిన ఆహారాల్లో చక్కెరతో పాటు కొవ్వు కూడా ఎక్కువే ఉంటుంది. బంగాళ దుంప చిప్స్, ఫ్రెంఛ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ మొదలగునవి అధిక చక్కెరని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది.

కెఫిన్

కాఫీ తక్కువ తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో కెఫిన్ నిద్రకి ఆటంకం కలిగిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. రోజుకి 1-2గ్లాసుల కాఫీ కంటే ఎక్కువ తాగకుండా ఉండడమే మంచిది.

మద్యం

ఆల్కహాల్ పానీయాలను ఆమడ దూరంలో ఉంచండి. ఆల్కహాల్ సేవనం ఎక్కువైతే అది రోగనిరోధక శక్తిని బాగా తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news