దేశాధ్యక్షురాలిపైనే నిషేధం విధించిన ఎయిర్‌వేస్‌.. ఎక్కడంటే..?

-

ఓ విమానయాన సంస్థ ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలినే తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఇంతకీ ఏ దేశ అధ్యక్షురాలు.. అది ఏ విమానయాన సంస్థ.. అసలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే..?

జార్జియాకు చెందిన విమానయాన సంస్థ జార్జియన్‌ ఎయిర్‌వేస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా ఆ దేశ అధ్యక్షురాలు శాలోమ్‌ జౌరాబిష్‌విలి పైనే నిషేధం విధించింది. జార్జియాతో విమాన సర్వీసులపై నాలుగేళ్లపాటు నిషేధం విధించిన రష్యా ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జార్జియా అధ్యక్షురాలు శాలోమ్‌ జౌరాబిష్‌విలి మాస్కోపై విధిస్తున్న ఆంక్షలను పాటించాలని రష్యా ప్రతిపాదనకు లొంగవద్దని ఆమె పిలుపునిచ్చారు. వీటిని లెక్కచేయని జార్జియన్‌ ఎయిర్‌వేస్‌ విమానం.. మాస్కోకు బయలుదేరింది.

దీనిపై స్పందిస్తూ ఆ విమానంలో ప్రయాణించనని అధ్యక్షురాలు పేర్కొన్నారు. ఇలా అధ్యక్షురాలు హెచ్చరికలపై జార్జియన్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకురాలు తమాజ్‌ డయాస్‌విలి స్పందించారు. జార్జియన్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పేంతవరకు అధ్యక్షురాలిని తమ విమానాల్లో అనుమతించబోమని, నిషేధం విధిస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news