ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

-

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు తయారు చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి ప్రజలను ప్రభావితం చేసేందుకు పక్కా వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రజా సంగ్రామ యాత్ర.. ఇప్పుడు జన సంపర్క్ యాత్ర వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్​లో ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యులు లక్ష్మణ్,  రాష్ట్ర ఇంఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్, పార్టీ సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు హాజరు కానున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. రాష్ట్రంలో పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై చర్చించనున్నారు. ఎన్నికల ఎజెండాగా జరిగే సమావేశంలో జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాల విజయవంతం, జూన్‌లో ఉత్తర, దక్షిణ తెలంగాణలో నిర్వహించే బహిరంగ సభలపైన తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news