కుప్పకూలిన బంగారం ధరలు..కారణం ఇదేనా.!

-

అంతర్జాతీయ మార్కెట్లో బంగార్ ధరలు ఒక్క సారిగా కుప్పకూలాయి..కరోనా వ్యాక్సిన్‌ త్వరలో మార్కెట్‌లోకి వస్తున్నందన్న వార్తలతో బలియన్‌ ఒక్కసారిగా దిగివచ్చింది..బంగారు 10గ్రాములకు 2,500 తగ్గి 49,659 పడిపోయింది..మరోవైపు వెండి ధరకూడా భారీ పతనం చూసింది..కిలో వెండి ధర రూ.4 వేలుతగ్గి రూ.61384కు దిగివచ్చింది..ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ పురోగతి తరువాత బంగారం మరియు వెండి ధరలు నేడు కుప్పకూలిపోయాయి..ఫైజర్-బయోఎంటెక్ ఉత్పత్రతి చేస్తున్న వ్యాక్సిన్‌తో ఇప్పటి వరకు ఎటువంటి తీవ్రమైన భద్రతా సమస్యలు రాలేదని.., ఈ నెలాఖరులో యుఎస్ అత్యవసర వినియోగ అధికారాన్ని పొందాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఫైజర్ ఈ ప్రకటన చేపిన వెంటనే బంగారం మరియు వెండి ధరలు నేడు భారత మార్కెట్లలో పడిపోయాయి. కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్ నుండి విజయవంతమైన డేటాను చూపించిన మొదటి ఔషధ తయారీదారులు.

గ్లోబల్ మార్కెట్లలో, కోవిడ్ టీకా ప్రకటన తరువాత స్పాట్ బంగారం 5శాతం పడిపోయింది, ఇది ఆగస్టు తర్వాత అతిపెద్ద పతనం.. యుఎస్ ఎన్నికల తరువాత బంగారం ధరలు క్షిణిస్తున్నాయి..వ్యాక్సిన్ ఆసన్నమైందనే ఆశావాదం మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి కరోనా లాడ్ డౌన్‌ కారణంగా నష్టపోయానా ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి మరింత ఉద్దీపన చర్యలను తగ్గిస్తుందని విశ్లేషకులు తెలిపారు.. తక్కువ వడ్డీ రేట్లతో పెట్టుబడిదారులను బంగారం వైపు ఆకర్షించాయి..మరో వైపు భారత్ లో బంగారం కోనుగోలు ఈ సంవత్సరం ఇప్పటివరకు భారతదేశంలో బంగారం 25శాతం పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news