బ్యాడ్ న్యూస్.. యూకే ఫ్యామిలీ వీసా నిబంధనలు మరింత కఠినతరం

-

వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రిషి సునాక్ సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకు రావాలనుకుంటే.. అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతం ఉండాలని పేర్కొంది. ఈ విషయం యూకే సర్కారు గతేడాదే ప్రకటించగా.. గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.

ఈ నిబంధన ప్రకారం.. ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్‌ చేయాలంటే.. వారి కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీ (గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్‌)లుగా ఉండాలన్న మాట. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 55శాతం పెంచారు. వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో సమానంగా కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్న వేళ ఇంతకంటే సులభమైన పరిష్కారం కన్పించలేదని బ్రిటన్‌ హోం మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news