బీఆర్‌ఎస్ నుంచి రూ.10 కోట్లు తీసుకోవడంపై కడియం శ్రీహరి క్లారిటీ ఇచ్చారు. నిన్నటి నుంచి ఇదే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చే ముందు… కేసీఆర్ దగ్గర రూ.10 కోట్లు తీసుకున్నాడని కడియంపై ఆరోపణలు వచ్చాయి. అయితే.. దీనిపై కడియం శ్రీహరి మాట్లాడుతూ… BRS అభ్యర్థిగా ప్రకటించాక డబ్బులు తీసుకున్నామని ప్రచారం చేస్తున్నారు….డబ్బులు తీసుకున్నామని నిరూపిస్తే ….. పోటీ నుంచి విరమించుకుంటామని సవాల్ చేశారు.
ఏఐసీసీ ఆశీర్వాదంతో కడియం కావ్య ప్రజల ముందుకు వచ్చిందని… బీజేపీ నాయకులకు చట్టాలపై అవగాహన లేదన్నారు. 10 సంవత్సరాల కాలంలో మోదీ చేసిందేమీ లేదని.. మతం మారినంత మాత్రాన కులం మారదని వెల్లడించారు. ఆరూరి రమేష్ ను… క్లాస్ వన్ కాంట్రాక్టర్ చేసింది నేను అంటూ వ్యాఖ్యలు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రమేష్ కి కాంట్రాక్టర్ గా అవకాశం ఇచ్చానని వెల్లడించారు. ఎంపీ టికెట్ విషయం లోనూ సహకరించాను…ఆయనకే టికెట్ ఇవ్వమని చెప్పానన్నారు. నేను పెంచిన ఆరూరి నాకే వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు.