టిక్‌టాక్‌ నిషేధానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం

-

చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. 352 మంది బిల్లుకు మద్దతుగా ఓటేయగా.. 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. తర్వాత ఇది సెనేట్‌కు చేరనుంది. ‘విదేశీ నియంత్రిత యాప్‌ల నుంచి అమెరికన్లకు రక్షణ’ పేరిట తీసుకొచ్చిన దీన్ని భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్‌ గల్లాఘే కలిసి రూపొందించారు.

ఈ బిల్లు టిక్‌టాక్ నిషేధానికి సంబంధించింది కాదని కృష్ణమూర్తి అన్నారు. దాన్ని నియంత్రిస్తున్న బైట్‌డ్యాన్స్‌ గురించి అని తెలిపారు. టిక్‌టాక్‌ యాజమాన్యం పూర్తిగా దాని చేతిలోనే ఉందన్న ఆయన.. ఆ కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధీనంలో పనిచేస్తోందని వెల్లడించారు. బైట్‌ డాన్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సీసీపీలో అత్యున్నత హోదాలో ఉన్నారంటే పరోక్షంగా టిక్‌టాక్‌ను సీసీపీ నియంత్రిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు సీపీపీ నియంత్రణలోని టిక్‌టాక్‌ అమెరికాలో కార్యకలాపాలు కొనసాగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మైక్‌ పెన్స్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news