పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్ కేంద్రంగా పని చేస్తున్న హౌతీ రెబల్స్ మళ్లీ రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో వాణిజ్య నౌకలపై దాడులను ప్రారంభించాయి. శనివారం రోజున ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడికి పాల్పడ్డారు. వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఘటన ఇదే.
దాడి జరిగినట్లు నౌకలోని భద్రతాధికారి ధ్రువీకరించారని యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. లైబీరియన్ జెండాతో యూఏఈ నుంచి సౌదీ అరేబియా వైపు ప్రయాణిస్తున్న గ్రోటన్ నౌకపై ఈ దాడి జరిగినట్లు వెల్లడించింది. హౌతీలు మాత్రం ఇప్పటి వరకు దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు ఎర్ర సముద్రం నడవాలో తరచూ నౌకలపై దాడులు చేసిన హౌతీలు దాదాపు రెండువారాల పాటు దాడులకు బ్రేక్ ఇచ్చారు. అయితే దీనికి గల కారణం మాత్రం తెలియదు. ఇక తాజాగా హమాస్ నేత హనియా హత్య సహా కీలక పరిణామాలు చోటుచేసుకున్న తర్వాత హౌతీలు మరోసారి దాడులకు తెగబడ్డారు.