పాపువా గినియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్ల వారుజామున ఉత్తర పాపువా న్యూ గినియాలోని అంబుంటిలో 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని యునైటేడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్ర అంబుంటికి తూర్పు-ఈశాన్యంగా 38 కిలో మీటర్ల దూరంలో 40.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడిందని అక్కడి అధికారులు వెల్లడించారు.
ఈ భూకంప ప్రమాదంలో ఇప్పటివరకు మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండటంతో పాపువా న్యూగినియాలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపంతో పలువురు ప్రాణాలను సైతం కోల్పోయారు.