ఓటీటీలోకి ఆస్కార్ సినిమా.. ‘ఓపెన్ హైమర్’ తెలుగు వెర్షన్ వచ్చేసింది

-

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఓపెన్ హైమర్’ తెలుగు అభిమానులకు శుభవార్త చెప్పింది. తాజాగా ఈ హిట్ సినిమా ఓటీటీలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. అణుబాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా చేసుకొని ఓపెన్ హైమర్ ను రూపొందించారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇంగ్లీషు, హిందీ వర్షన్ లో రూ.119 రెంట్ విధానంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఓపెన్ హైమర్..  జియో సినిమాలో  స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాళీ, హిందీ వంటి భాషల్లో అందుబాటులో ఉంది. జియో సినిమా వినియోగదారులు అయితే ఎలాంటి రెంట్ లేకుండా ఈ సినిమా వీక్షించవచ్చు. 96వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఓపెన్ హైమర్ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం సహా ఏడు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.7,600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news