అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి అయిన డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్పై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కమలా కూడా ట్రంప్కు దీటుగా సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో ఆమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈసందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. “డొనాల్డ్ ట్రంప్ నిబద్ధత ఉన్న నాయకుడు కాదు. ఆయన ఎన్నికై తిరిగి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తాం. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటాం. నేను అధికారంలోకి వస్తే 21 శతాబ్ది విజేతగా అమెరికా నిలుపుతాను. ఎట్టిపరిస్థితుల్లో చైనాకు ఆ అవకాశం ఇవ్వబోను. అమెరికాను మరింత బలోపేతం చేస్తామని.. ప్రపంచ నాయకత్వాన్ని త్యజించేది లేదు.” అని కమలా హ్యారిస్ అన్నారు.