చైనాను ఫోకస్ చేసిన భారత్…!

-

కరోనా వైరస్ విషయంలో చైనా అన్నీ కూడా పచ్చి అబద్దాలు ఆడుతుంది అనే ఆరోపణలు ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. ముందు అమెరికా ఆరోపణలు చేయగా ఆ తర్వాత భారత్ కూడా పరోక్షంగా చైనాను టార్గెట్ చేసింది. ఇక యూరప్ దేశాలతో పాటుగా ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు చైనా మీద చాలా వరకు ఆగ్రహంగా ఉన్నాయి. ఆ దేశం కారణంగానే ఈ పరిస్థితి అంటున్నాయి.

ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్… తో యూరప్ దేశాలు అన్నీ కూడా గొంతు కలుపుతున్నాయి. ఈ తరుణంలో భారత్ కూడా చైనాను ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. చైనాలో మన వాళ్ళను పంపి అక్కడి వాస్తవ పరిస్థితుల మీద ఆరా తియ్యాలి అని మోడీ సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో మన దేశ ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు పలువురు.

మన దేశ నిఘా విభాగంలో ఉండే కొందరు అధికారులు వైద్యుల బృందం తో కలిసి ఇప్పటికే చైనాలో దిగారని అంటున్నారు. చైనా చేస్తున్న వ్యవహారాల మీద దృష్టి పెట్టారని, ఇక కిట్స్ విషయంలో మోసం చేయడం తో ఆగ్రహంగా ఉన్న మోడీ చైనా అంతు చూడాలని భావిస్తున్నారు. చైనా నుంచి వచ్చే ప్రతీ ఉత్పత్తిని కూడా నిలిపివేసే ఆలోచనలో ఆయన ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నాయి.

ఇప్పటికే మన అధికారులు చైనా ఉత్పత్తుల మీద ఒక కన్నేసి ఉంచారని అంటున్నారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులను ఆపేసే ఆలోచనలో మోడీ సర్కార్ ఉందని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. యూరప్ దేశాలతో కూడా మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని మోడీ భావిస్తున్నారు. ఇక చైనా తో ఎలాంటి వాణిజ్యం వద్దనే భావన లో మన దేశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version