భారతదేశం విజయగాథల సమాహారం.. బరాక్ ఒబామా.

అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన పుస్తకంలో ఇండియా గురించి ఆసక్తికరమైన కథనాన్ని రాసాడు. ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతో ప్రచురితమైన తన పుస్తకంలో ఇండియా గురించి రాసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల నుండి ప్రపంచ తీవ్రవాద సంస్థ అయిన అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ని అంతమొందించే వరకూ సాగిన తన ప్రయాణాన్ని మొదటి భాగంగా తీసుకొచ్చారు.

ఇందులో ఇండియా గురించి మాట్లాడుతూ, 1990 నుండి ఆర్థికంగా ఇండియా బాగా నిలదొక్కుకుందని, వ్యాపారాలు పెరిగాయని, మధ్యతరగతి జనాభా బాగా పెరిగిందని, అనేక అంశాల్లో ఇండియా ముందు వరుసలో ఉందని, ప్రస్తుత సమాజంలో ఇండియా ఒక విజయగాథల సమాహారం అని అన్నాడు. కుంభకోణాలు, వేర్పాటువాద ధోరణులు ఉన్నప్పటికీ ఇండియా దూసుకెళ్తుందని అభిప్రాయపడ్డాడు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా 2008 నుండి 2016వరకూ పనిచేసారు.