కనుపాపలే .. పాస్‌పోర్డ్‌లయే!

Join Our Community
follow manalokam on social media

అవును ఇది నిజమే! దీన్ని నిజం చేసింది దుబాయ్‌ విమానాశ్రయం. కృత్రిమ మేధతో ఇది సాధ్యం చేసింది. ఈ ఎయిర్‌ పోర్టులో కళ్ల ద్వారా ఐరిస్‌ స్కానింగ్‌ చేస్తోంది. దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు ఏమీ లేకుండానే ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటుంది. దీనికి ఆజ్యం పోసింది కరోనా. అవును కరోనా సమయంలో మనం అనేక పాఠాలను నేర్చుకున్నాం. వర్క్‌ఫ్రం హోం నుంచి ఆన్‌ లైన్‌ క్లాసులు, సొంత ఇంటి ఫుడ్‌ . ఇలా రకరకాల మార్పులు వచ్చాయి. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కాంటక్ట్‌ లెస్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది. గత నెలలోనే ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విమానాశ్రయంలో ప్రయాణì కులను చెక్‌ ఇన్‌ సమయంలో ఐరిస్‌ స్కానర్‌ వద్ద నిలవగానే.. వారి పాస్‌పోర్టు వివరాలన్ని ఆన్‌లైన్‌లో నమోదైపోతున్నాయి. దీనిని యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మొదటిసారిగా ప్రయోగించిది.

  • దీని వల్ల ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లదు.
  • ప్రయాణికుల ఈ గుర్తింపు డేటా కూడా అవసరమైన సమయం వరకే ఉంటుందని విమానాశ్రయ సమాచారం.
  • ఫేషియల్‌ రికగ్నిషన్‌ కంటే ఐరిస్‌ విశ్వసనీయం. కానీ, డేటా వినియోగం, బయోమెట్రిక్‌ దుర్వినియోగం అవుతాయేమోనని విశ్లేషకులు అంటున్నారు.
  • ప్రైవేటు రంగంలోనూ దీన్ని విస్త్రతం చేస్తున్నామని ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ ప్రకటించారు.
  • ఇటీవలే మన దేశంలోని బెంగళూరు, బేగంపేట విమానాశ్రయాల్లో కూడా దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు.
  • కానీ, డిజీ యాత్ర పేరిట ప్రయాణికుల ప్రవేశ మార్గంలో సెకక్యూరిటీ చెక్‌ వద్ద ఫెషియల్‌ రికగ్నిషన్‌ వాడుతున్నాం.
  • అయితే, ఐరిస్‌ విధానాన్ని ఇది వరకు ప్రయత్నించలేదు.
  • కరోనా సమయంలో విపరీతంగా థర్మల్‌ స్క్రీనింగ్, ఫేస్‌ స్కానర్లను ఉపయోగించాం.
  • డిజీ యాత్రను కూడా అమల్లోకి తీసుకువచ్చింది మొదట మన దే«శమేనని కేంద్ర మంత్రి తెలిపారు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...