తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గతఐదు రోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ సూచించారు.
”పార్టీ శ్రేణులకు,కార్యకర్తలకు,ప్రజలకు,నాయకులకు మనవి. నాకు ర్యాపిడ్ టెస్ట్ లో నెగిటివ్ రాగా, RT PCR టెస్టులో కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇప్పటికే కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తేదీలు కుదించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ స్చేద్యూల్ ప్రకారం ఈ నెల 26 దాకా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగించే అవకాశం కనిపిస్తోంది.