హమాస్ ను నాశనం చేయడమే లక్ష్యంగా.. గాజాలోకి ఇజ్రాయేల్ సైన్యం

-

హమాస్‌ ఉగ్రవాదులను మ‌ట్టుబెట్టాలని శపథం పూనిన ఇజ్రాయెల్.. ఆ దిశగా తన ప్రయత్నం ముమ్మరం చేసింది. గాజాను అష్టదిగ్బంధనం చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం అక్కడ అడుగుపెట్టింది. ఇన్ని రోజులు హమాస్ స్థావరాలపై వైమానికి దాడులతో విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్ సైన్యం.. ఇప్పుడు గాజాలోకి ప్రవేశించి భూతల దాడులు షురూ చేశాయి. మిలిటెంట్లతో పోరాడేందుకు, ఆయుధాలను ధ్వంసం చేయడానికి, బందీలుగా పట్టుకున్న వారిని వెతకడం కోసం తమ సైన్యం వెళ్లిందని వెల్లడించింది.

 24 గంటల్లోగా ఉత్తర గాజాను విడిచి వెళ్లిపోవాలని అక్కడున్న 11 లక్షల మందిని శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటిలోగా వెళ్లకపోతే తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. గాజా సిటీ నుంచి వెళ్లిపోతున్న వారిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరపడం వల్ల 70 మంది మృత్యువాత పడ్డారని హమాస్‌ అధికారులు తెలిపారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులేనని వెల్లడించారు.

హమాస్ ఉద్రవాద సంస్థను నాశనం చేస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రతిజ్ఞ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని.. గతంలో కంటే బలంగా ఈ యుద్ధాన్ని ముగిస్తామని అన్నారు. హమాస్​ను అంతం చేస్తామని, ఈ ఆపరేషన్​కు తమకు అంతర్జాతీయంగా మద్దతు ఉందని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news