ఇరాన్‌కు సహకారంపై అసంతృప్తితో.. పుతిన్‌కు నెతన్యాహు ఫోన్‌

-

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​పై అలిగారు. ఇరాన్‌కు రష్యా సహకారం అందించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు నెతన్యాహు పుతిన్​తో ఫోన్​లో మాట్లాడారు. ఇరాన్‌కు రష్యా సహకారం అదించడం ప్రమాదకరమైనదని పుతిన్‌తో నెతన్యాహు చెప్పినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

ఇజ్రాయెల్‌, హమాస్‌ కాల్పుల విరమణ పాటించాలని శనివారం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానానికి రష్యా మద్దతు ఇవ్వగా.. అమెరికా వీటో అధికారంతో అడ్డుకుంది. అయితే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు తెలపడంపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరోవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై పుతిన్‌ స్పందిస్తూ.. ఇరువురి మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు రష్యా అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తుందని చెప్పినట్లు సమాచారం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించి తీరాలని పుతిన్‌ పేర్కొన్నట్లు మాస్కో వెల్లడించింది. ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనే క్రమంలో సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news