ఈమధ్య కాలంలో పలు దేశాల గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు విహరిస్తున్నాయని. ఆ దేశాల రక్షణ శాఖ వెంటనే వాటిని గుర్తించి నిర్వీర్యం చేస్తోంది. అయితే గతంలో జపాన్లో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. దానిపై ఆ దేశ రక్షణ శాఖ నిఘా పెట్టి లోతుగా దర్యాప్తు చేసింది. చివరకు ఏవేంటో నిర్ధారణకు వచ్చింది.
గతంలో తమ గగనతలంపై విహరించిన గుర్తుతెలియని వస్తువులు చైనాకు చెందిన బెలూన్లేనని జపాన్ రక్షణ శాఖ ధృవీకరించింది. నిర్ధిష్ట బెలూన్ ఆకారపు ఎగిరే వస్తువులును విశ్లేషించిన తర్వాత అవి మానవరహిత నిఘా బెలూన్లని, అవి చైనాకు చెందినవేనని తాము నిర్ధారించామని వెల్లడించింది. జపాన్ గగనతలంపై 2019 నవంబర్, 2020 జూన్, 2021 సెప్టెంబర్ నెలలో గుర్తుతెలియన వస్తువు విహరించాయని తెలిపింది.
ఇలా మానవరహిత బెలూన్లతో ఇతర దేశాల్లో నిఘా ఉంచడం, గగనతల ఉల్లంఘనలు ఎంతమేరకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాలని చైనాకు డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి పునరావృతం కావొద్దని వార్నింగ్ ఇచ్చింది.