నా కలల రాకుమారుడా.. నాకు దూరంగా ఉండి బాధ పెడుతున్నా సంతోషమే.. రానాకు వైఫ్ మిహికా ఎమోషనల్ పోస్ట్

-

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అందుకున్నాడు. దాదాపు మూడేళ్లు క్రితమే రానాకు పెళ్లయింది కదా మరి ఇప్పుడు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అతనికి శుభాకాంక్షలు తెలిపింది ఎవరో కాదు రానా వైఫ్ మిహికా.. నా కలల రాకుమారుడు దూరంగా ఉన్నా నాకు సంతోషమే అంటూ వాలెంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్టును పంచుకున్నారు.. ప్రేమికుల రోజు అంటేనే ప్రేమికులకు ఒక అద్భుతమైన రోజు.. ఈ రోజును ప్రతి ఒక్కరూ ఎంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. సెలబ్రిటీలు తమ పార్టనర్ పై ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఈ జాబితాలోనే చేరారు యంగ్ హీరో దగ్గుబాటి రానా వైఫ్ మిహికా బజాజ్..

Rana Daggubati's wife Miheeka Bajaj celebrates 1 year of proposal. Read  post - India Today

వాలెంటెన్స్ డే సందర్భంగా భర్తతో ఉన్న ఒక రొమాంటిక్ పిక్ ను పంచుకున్న మిహికా..ఒక ప్రేమ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..భర్త రానాతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న మిహీకా.. ‘స్ట్రాంగ్, స్వీట్, స్టైలిష్, ప్రెట్టీ, వైల్డ్ అండ్ వండర్‌ఫుల్.. నా గురించి చెప్పేందుకు పదాలు దొరకడం లేదు. నువ్వు నన్ను విపరీతంగా ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు’ అంటూ మెసేజ్‌ పోస్ట్ చేసిన మిహికా.. జస్ట్ సరదాకే! అని కంటిన్యూ చేసింది. ‘నా కలల రాకుమారుడికి.. బిజీ లైఫ్‌లో చాలా రోజులు నాకు దూరంగా ఉండి బాధపెట్టి ఉండవచ్చు. కానీ ఆ చిరునవ్వే నన్ను మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే!’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు అందరూ వీరికి మరొకసారి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే లైఫ్ అంతా ఇలాగే హ్యాపీగా ఉండండి అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే రానాతో పరిచయం కాస్త ప్రేమగా మారి మిహికా ఇతని 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా గడుపుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో రానా దూరంగా ఉంటూ వస్తున్న మిహిక మాత్రం అప్పుడప్పుడు ఇలా రొమాంటిక్ పిక్స్ ను షేర్ చేసుకుంటూ వస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news