కమలా హ్యారీస్ భర్తకు బైడెన్ భార్య ముద్దు.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య.. అగ్రరాజ్య ప్రథమ మహిళ జిల్​ బైడెన్.. వైస్​ప్రెసిడెంట్​ కమలా హారిస్​ భర్త డగ్​ఎంహాఫ్‌కు ముద్దు పెట్టారు. అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి జో బైడెన్‌ మంగళవారం ప్రసంగించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

నిఘా బెలూన్‌ ఘటనతో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌.. డ్రాగన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు స్టేట్‌ ఆఫ్ ది యూనియన్‌ ప్రసంగంలో బైడెన్‌ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి బైడెన్‌ మంగళవారం ప్రసంగించారు. చైనా నిఘా బెలూన్ అంశం సహా పలు విషయాలపై ఆయన మాట్లాడారు.  ఆ సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్.. వైస్​ ప్రెసిడెంట్​ కమలా హారిస్​ భర్త డగ్​ ఎంహాఫ్​కు కిస్​ పెట్టారు. వెంటనే ఆ చిత్రాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?