రెడీ అవుతున్న ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’

-

దాసరి పద్మజ – విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ ‘ సినిమా కి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నాడు. దాసరి పద్మజ – విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, టైటిల్ ను బట్టే సినిమా ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నడుస్తుందనే విషయం అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంటుకి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఈ నెల 9వ తేదీన .. అంటే రేపు హైదరాబాదు .. బంజారా హిల్స్ లోని ‘ఆర్కే సినీ ప్లెక్స్’లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Phalana Abbayi Phalana Ammayi Movie Update

ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. చైతూ ‘థ్యాంక్యూ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మాళవిక నాయర్, ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. ఇక ఆమె నుంచి రావడానికి ‘అన్నీ మంచి శకునములే’ సినిమా కూడా లైన్లోనే ఉంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news