ఉక్రెయిన్​కు అండగా ఉంటాం.. రష్యాను ఎప్పటికీ గెలవనివ్వం : బైడెన్

-

ఉక్రెయిన్​కు తమ అండ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా సహా మిత్రదేశాలు ఉక్రెయిన్‌ వెన్నంటే ఉంటాయని అన్నారు. ఉక్రెయిన్​పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఏడాది పూర్తైన నేపథ్యంలో బైడెన్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే పాశ్చాత్య సంకల్పాన్ని ఈ యుద్ధం కఠినతరం చేసిందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. పోలాండ్​ వార్సాలోని ప్రఖ్యాత రాయల్‌ క్యాసిల్‌ వేదికగా పౌరులు, ఉక్రెయిన్‌ శరణార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్యాలు నేటికి, రేపటికి, ఎప్పటికీ స్వేచ్ఛకు రక్షణగా నిలుస్తాయని బైడెన్ ఉద్ఘాటించారు. ఈ యుద్ధం ఉక్రెయిన్​లో మౌలిక సదుపాయాలు దెబ్బతీయటమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కీవ్​లో ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయిన మరుసటి రోజే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కీవ్ బలంగా, గర్వంగా ఉందని బైడెన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news