మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంబీఎస్ జువెల్లర్స్ అధినేత సుఖేశ్ గుప్తా ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సుఖేశ్‌ను అధికారులు విచారిస్తున్నారు. ఎంఎంటీసీ వద్ద రూ.225 కోట్లు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంలో సుఖేశ్ గుప్తా హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తును నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. సుఖేశ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈడీ విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో సుఖేశ్ గుప్తా ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు.