బైడెన్ భావోద్వేగం.. నేనెప్పటికీ మీ బిడ్డనే..

-

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఎన్నికల మీద అసక్తి చూపారు. అగ్రరాజ్యమైన అమెరికాకి దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారని అంతా ఎదురుచూసారు. ట్రంప్, బైడెన్ మధ్యలో జరిగిన పోటీలో జో బైడెన్ గెలుపొంది చరిత్ర సృష్టించారు. ట్రంప్ వస్తాడనుకున్న వారికి జో బైడెన్ గెలవడం ఆశ్చర్యం కలిగించింది. ఐతే ఈ రోజు జో బైడెన్, అమెరికా దేశ అధ్యక్ష్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో వాషింగ్టన్ కి పయనమైన బైడెన్ తన సొంత గడ్డ డెలాబేర్ లో ఉద్వేగ పూరిత ప్రసంగాన్ని ఇచ్చారు. అమెరికాకి అధ్యక్ష్యుడినైనా డెలాబెర్ బిడ్డనే అని గర్వంగా చెప్పుకున్నాడు. తాను పుట్టి పెరిగిన ఈ నేల తనకెంటో చేసిందని, డెలాబెర్ ప్రజల అభిమానం వదులుకోలేనని, మీరంతా నాకు ఆత్మీయులని అన్నాడు. మొత్తానికి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సమయంలో అందరినీ భావోద్వేగానికి గురి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news