కేటీఆర్ సీఎం కావాలి..టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక వ్యాఖ్యలు !

-

మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని తన కుమారుడు కేటీఆర్ కి పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడని బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. బోధన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కనుక సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వచ్చేనెల అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలని తాను ఆకాంక్షిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

అంతే కాదు కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ను కోరుతున్నానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సీఎం అయ్యేలాగా ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన కోరారు. తనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయం ఇదేనని ఆయన అన్నారు. ఇక పక్కనే ఉన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆయనను సీఎం చేయాలని కోరుతున్న వారిలో నేనూ ఒకడిని అని ఆయన అన్నారు. కెసిఆర్ ఆలోచించి కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news