అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. పోటీలో కొనసాగనున్న బైడెన్‌!

-

డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన డిబేట్లో తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే తాను వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలను తాజాగా బైడెన్ ఇచ్చారు. వార్ధక్యంతో వచ్చిన తన ఇబ్బందులను అంగీకరించిన ఆయన నిజాలు మాట్లాడటం ఒక్కటే తనకు తెలుసని స్పష్టం చేశారు..  త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్, డెమోక్రటిక్‌ పార్టీ పక్షాన బైడెన్‌లు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న సంగతి తెలిసిందే.

గురువారం రాత్రి అట్లాంటాలో వీరిద్దరి మధ్య 90 నిమిషాల పాటు జరిగిన సంవాదంలో బైడెన్‌ పలుమార్లు తడబడటంతో ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ కుటుంబ సభ్యులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై మరోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా బైడెన్‌కు సూచించినట్లు వార్తలు వచ్చాయి. భార్య జిల్, కుమారుడు హంటర్, మనుమలు సహా బాసటగా ఉంటామని ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news