BREAKING : డెమోక్రాటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్‌ ఖరారు

-

అంతా అనుకున్నట్టే జరిగింది. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఎట్టకేలకు అధికారికంగా ఖరారయ్యారు. ఈ విషయాన్ని ఆమె ‘ఎక్స్‌’లో అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్లు తెలిపారు. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి తొలుత ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అనారోగ్య కారణాల వల్ల తరచూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ వయసు మీద పడిందనే విషయాన్ని గుర్తు చేస్తుండటంతో పార్టీ ఆయణ్ని తప్పుకోవాలని డిమాండ్ చేసింది. మొదట తాను తప్పుకోనని చెప్పినా.. అన్నీ బేరీజు వేసుకుని చివరకు తప్పుకుని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు తన మద్దతు ప్రకటించారు. అలా తాజాగా ఆమెను పార్టీ అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించింది. రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ను దీటుగా ఎదుర్కొంటానని కమలా హారిస్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version