ఇవాళ తెలంగాణ బడ్జెట్ పై కీలక చర్చ.. అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా ?

-

ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గురువారం రోజున తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్ను విశ్లేషించుకోవడానికి ఒక రోజు అసెంబ్లీకి సెలవు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఇవాళ మళ్లీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా తెలంగాణ బడ్జెట్ పై కీలక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు రద్దు కానున్నాయి. తెలంగాణ బడ్జెట్ పై చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు… తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానాలు ఇస్తారు. అయితే ఇలాంటి కీలక సమయంలో… ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి డుమ్మా కొట్టనున్నారట కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కేవలం బడ్జెట్ పెట్టిన రోజు మాత్రమే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం ట్రాష్, గ్యాస్ అని ప్రకటించి వెళ్లిపోయారు. అయితే ఈ బడ్జెట్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదీసేందుకు మాత్రం అసెంబ్లీకి రాలేకపోతున్నాను కేసీఆర్. కేవలం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతోనే రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పేలా ప్లాన్ వేశారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version