కరాచీలో బాంబ్ బ్లాస్…. ఒకరు మృతి, 13 మందికి తీవ్రగాయాలు

-

దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబ్ పేలుడుతో దద్దరిల్లింది. గురువారం రాత్రి జరిగిన బాంబ్ దాడితో ఉలిక్కిపడింది. దేశ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ పేలుడు సంభవించింది. నగరంలో రద్దీగా ఉండే సద్దార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పాకిస్తాన్ వేర్పాటువాద సంస్థ ఈ పేలుడుకు కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బాంబ్ పేలుడులో ఒకరు మరణించగా… 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్న జిన్నా మెడికల్ సెంటర్ తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బాంబ్ పేలుడుతో  పేలుడు పదార్థంలో ఉన్న బాల్ బెరింగ్స్ వల్ల చాలా మంది శరీరాలు ఛిద్రం అయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు. రద్దీ ఉన్న సద్దార్ ప్రాంతంలో ఒక సైకిల్ పై 2-2.5 కిలోల పేలుడు పదార్థాలను అమర్చి టైమింగ్ డివైజ్ ద్వారా పేల్చినట్లు అధికారులు నిర్థారించారు. అయితే గత రెండు వారాల క్రితం ఇలాగే బాంబ్ దాడి జరిగింది… ఈ ఘటనలో నలుగురు చైనీయులు మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news