UK-ఇండియా అవార్డ్స్‌లో మేరీకోమ్ కి ‘గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

-

UK-ఇండియా అవార్డ్స్‌ లో గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్‌ను మేరీ కోమ్ అందుకున్నారు. UK-ఇండియా రిలేషన్స్ అవార్డుకు జీవితకాల సహకారం ఇచ్చారు. విండ్సర్‌లో ఇండియా గ్లోబల్ ఫోరమ్ 5వ వార్షిక UK-ఇండియా అవార్డులు UK-భారత్ భాగస్వామ్యాన్ని నడిపేందుకు కొంత మంది వ్యక్తులు, సంస్థలను గౌరవించే అవార్డులు అందించారు. జూన్ 29, 2023 న స్పోర్టింగ్ లెజెండ్, మొట్టమొదటి బాక్సింగ్ ఒలింపిక్ పతాక విజేత మేరీ కోమ్‌ కి 5వ వార్షిక UK-ఇండియా అవార్డ్స్‌లో ‘గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వచ్చింది. అవార్డు తరవాత మేరీకోమ్ మాట్లాడారు.

UK-ఇండియా అవార్డ్స్‌
UK-ఇండియా అవార్డ్స్‌

ఈ సాయంత్రం ఇలా పాల్గొనడం నా అదృష్టం అన్నారు. అలానే ఇది పెద్ద గౌరవం అని కూడా ఆమె అన్నారు. 20 సంవత్సరాలుగా పోరాడుతున్నాను బాక్సింగ్ కోసం అని అన్నారు. దేశం కోసం, నా కుటుంబం కోసం నేను ఎంతో త్యాగం చేశానన్నారు. నిజంగా ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంతో మంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు. బ్రిటన్‌లోని ప్రముఖ హాస్యనటుడు ఇంప్రెషనిస్ట్ రోరే బ్రెమ్‌నర్ కూడా పాల్గొన్నారు.

IGF యొక్క CEO వ్యవస్థాపకుడు మనోజ్ లాడ్వా మాట్లాడుతూ సంస్థ, గ్రిట్, ఆవిష్కరణ, బ్రిటీష్ మరియు భారతీయ వ్యాపారాలు, సంస్థలు, పెద్ద అలానే చిన్న సంస్థల విజయాన్ని జరుపుకుంటాము అన్నారు. యుకె-భారత సంబంధాలకు జీవితకాల సహకారం అవార్డు ని డైరెక్టర్ శేఖర్ కపూర్ అందుకున్నారు ఆయనకీ కృతజ్ఞతలు చెప్పారు. అలానే UK-ఇండియా సంబంధాలకు ముఖ్యమైన సహకారం అవార్డు గ్రహీత, నెహ్రూ సెంటర్ లండన్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి కూడా మాట్లాడారు. భారతదేశ సంస్కృతి గురించి చెప్పారు. ఇక అవార్డుల వివరాలని కూడా చూసేద్దాం.

మార్కెట్ ఎంట్రీ ఆఫ్ ది ఇయర్ – క్రౌడ్ ఇన్వెస్ట్
కన్సల్టెన్సీ ఆఫ్ ది ఇయర్- SannamS4
లీగల్ ప్రాక్టీస్ ఆఫ్ ది ఇయర్ – సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్
ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ – ICICI బ్యాంక్ UK Plc
టెక్నాలజీ కంపెనీ ఆఫ్ ది ఇయర్ – ఎంఫాసిస్
బిజినెస్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ – ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI – UK)
సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్- యాక్షన్ ఎయిడ్ UK
UK-ఇండియా సంబంధాలకు ముఖ్యమైన సహకారం -నెహ్రూ కేంద్రం
UK-భారత్ సంబంధాలకు జీవితకాల సహకారం -శేఖర్ కపూర్
గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ – మేరీ కోమ్

అలిసన్ బారెట్, డైరెక్టర్ – ఇండియా, బ్రిటిష్ కౌన్సిల్
హర్మీన్ మెహతా, గ్రూప్ చీఫ్ డిజిటల్ & ఇన్నోవేషన్ ఆఫీసర్, BT గ్రూప్ Plc
ప్రియా గుహ, వెంచర్ పార్టనర్ & NED, మెరియన్ వెంచర్స్ & UKRI
సర్ రాన్ కలీఫా, నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ ఛైర్మన్
సైఫ్ మాలిక్, CEO, UK & రీజినల్ హెడ్ ఆఫ్ క్లయింట్ కవరేజ్, UK & యూరోప్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
అనుజ్ J చందే, భాగస్వామి & సౌత్ ఏషియా బిజినెస్ గ్రూప్ హెడ్, గ్రాంట్ థార్న్టన్ UK LLP
నాలెడ్జ్ పార్ట్‌నర్స్ గ్రాంట్ థోర్టన్

150 మంది స్పీకర్లు 2,000+ మంది పాల్గొన్నారు. 12 మార్క్యూ ఈవెంట్‌లను కలిగి ఉంది ఇది. ‘UK-ఇండియా వీక్ 2023’ ఇండియా, UK నుండి వ్యాపార నాయకులు ఇలా ఎంతో మంది ప్రముఖులు దీన్ని నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news