బ్రేకింగ్: భారత్ చైనా మధ్య మళ్ళీ చర్చలు

-

భారత్ చైనా మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య చర్చలను కొనసాగిస్తూ సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని ఇరు దేశాల ఆర్మీ భావిస్తుంది. భారత మరియు చైనీస్ మిలిటరీ కమాండర్లు తమ ఏడవ రౌండ్ చర్చల కోసం అక్టోబర్ 12 న లడఖ్‌లో సమావేశం కానున్నారు. అయితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) మాత్రం వెనక్కు తగ్గే సంకేతాలు ఇవ్వడం లేదు.

భారీగా సరిహద్దుల్లో చైనా ఆర్మీ దళాలను మోహరించింది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) లో దాని స్థానాలను కాపాడుకోవడానికి కంటైనర్లు మరియు మంచు గుడారాలను రెడ్‌లైన్స్‌లో ఉంచుతుంది. కంటైనర్ లను కూడా ఏర్పాటు చేసారు. చలికాలం వస్తున్న నేపధ్యంలో సైనికులను కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కంటైనర్‌లో నాలుగైదు మంది సైనికులు ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news