పాకిస్తాన్‌ లో ఆ సెక్స్ ఆపరేషన్ల అమలు సాధ్యమేనా

-

పాకిస్తాన్‌ ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకుంది. కామాంధులపై ఉక్కుపాదం మోపేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు సిద్ధమవుతోంది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాల కట్టడికై కఠినమైన చట్టాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రేపిస్టుల లైంగిక పటుత్వం తగ్గేలా ఆపరేషన్లు నిర్వహించడం సహా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అదే జరిగితే పాకిస్తాన్‌లో పెను మార్పు సంభవించినట్లే..

పాకిస్తాన్ తీసుకున్న సంచలన నిర్ణయంపై ఇప్పుడు చాలా మంది వణికిపోతున్నారు. ఎందుకంటే.. అది అలాంటిలాంటి నిర్ణయం కాదు.. ఇమ్రాన్‌ఖాన్‌కు మైలేజ్‌ తెచ్చే నిర్ణయం. ఆడపిల్లల్లో, యువతుల్లో, మహిళల్లో ధైర్యం నింపే నిర్ణయం. అందుకే పాకిస్తాన్‌ అంటేనే పీడదేశం అనే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇమ్రాన్‌వైపు మంచి మనసుతో చూస్తున్నాయి. ఎందుకంటే… మహిళలు, చిన్నారులపై అత్యాచారాల కట్టడికై కఠినమైన చట్టాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రేపిస్టుల లైంగిక పటుత్వం తగ్గేలా ఆపరేషన్లు నిర్వహించడం సహా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమైంది.

పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అత్యాచారాలకు పాల్పడిన వారిపై రసాయనాలు ఉపయోగించి నపుంసకులుగా మారుస్తారు. ఇవన్నీ..మనకు కొత్తేమో గానీ, ఇతర దేశాలలో ఎప్పటినుండో ఉన్నాయి. స్వీడన్ రసాయనాలను ఉపయోగించి నపుంసకులుగా మార్చడం అనే ప్రక్రియను ఎప్పుడో ప్రవేశ పెట్టింది. కొన్ని చోట్ల శస్త్ర చికిత్సను ఉపయోగించి శాశ్వతంగా నపుంసకులుగా మార్చడం కూడా జరుగుతోంది. కానీ, అవేవీ అక్కడ అత్యాచారాలను నిరోధించాయనడానికి ఆధారాలు లేవు. స్వీడన్ అయితే, అత్యాచారాల రాజధాని అని పేరు తెచ్చుకుంది, ప్రపంచములో రెండవ స్థానం ఆక్రమించింది, కన్విక్షన్ రేట్ కూడా చాలా తక్కువ. అమెరికాలో అయితే ప్రతి 2 నిమిషాలకూ ఒక అత్యాచారం జరుగుతుంది అని ఎఫ్.బి.ఐ వారి గణాంకాలే చెబుతున్నాయి.

మన దేశంలో ప్రతి 40 నిమిషాలకో రేప్‌ జరుగుతోంది. అయితే, చాలా అత్యాచారాల కేసులు భారత దేశంలాంటి దేశాలలో నమోదు చేయడం లేదని సర్ది చెప్పు కుందామన్నా, 2 నిమిషాలకు ఒక రేప్ అనేది అంత కఠిన చట్టాలున్న దేశాలలో ఉండకూడదు కదా? ఇంకో విషయ మేమిటంటే, అక్కడ స్త్రీవాదులు కూడా చాలా మంది మహిళలు అత్యాచార కేసులను నమోదు చేయడానికి జంకు తున్నారు. అంటే దీనర్థం. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆడవాళ్లకు రక్షణ లేదనే అర్థమవుతుంది.

పాకిస్తాన్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో కఠినమైన చట్టం తీసుకురావాల్సిందిగా ఇమ్రాన్‌ భావించారని, పౌరులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన చాలా సార్లు చెప్పారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో వారి వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడతామని ఇమ్రాన్‌ చెప్పినట్లు అక్కడి మీడియా అంటోంది.

నూతన చట్ట రూపకల్పనలో భాగంగా.. లైంగిక దాడి కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయాలని కొంతమంది మంత్రులు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇందుకు సుముఖంగా లేని ఇమ్రాన్‌ ఖాన్‌, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన వద్దని వారించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం లాహోర్‌లో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య, ఇటీవల ఓ మహిళపై సామూహిక లైంగికదాడి ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

పాకిస్తాన్‌ అంటేనే మనకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఒక రకమైన అభిప్రాయం ఉంది. అక్కడ ఆడవారికి అస్సలు రక్షణ లేదని..అక్కడి వాళ్లు చాలా భయంకరంగా ఉంటారని.. అత్యాచారాలు..హత్యలకు పాకిస్తాన్‌ నిలయమని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి దేశం పైగా ఇప్పటి వరకు మనం ఆ దేశంలో జరిగే ఎన్నో ఆకృత్యాలు జరగడం చూశాం.. అయితే ఇప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్ణయంతో ఆ దేశంలో ఆడవాళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు. అత్యాచారాలకు పాల్పడేవాళ్లు ఇకమీదట భయపడుతారు. ఆడవాళ్ల మీద చెయ్యి వెయ్యాలన్నా గజగజ వణికిపోతారు. ఎందుకంటే.. అంత గట్టి నిర్ణయం ఆ దేశ ప్రభుత్వం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news