పాకిస్తాన్ లో హిందువులపై కక్ష సాధింపు…!

పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో కోపంతో ఉన్న ఒక గుంపు హిందూ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేసింది. ఈ గుంపు 300 మందికి పైగా హిందూ కుటుంబాలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ సంఘటన ఆదివారం షీటల్ దాస్ కాంపౌండ్‌ లో జరిగింది. ఆ ప్రాంతంలో  300 మంది హిందూ మరియు 30 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి.

అక్కడ నివాసం ఉండే వారు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే… హిందూ కుటుంబాలపై దాడి చేయాలనే ఉద్దేశ్యంతో వందలాది మంది పురుషులు కాంపౌండ్ గేట్ వెలుపల సమావేశమయి ఆ తర్వాత దాడికి దిగారు. ఈ సంఘటన తరువాత, 60 కి పైగా హిందూ కుటుంబాలు నగరంలోని ఇతర ప్రాంతాలకు మారాయి. ముస్లింలు అధికంగా ఉన్న పాకిస్తాన్‌లో 220 మిలియన్ల జనాభాలో దాదాపు రెండు శాతం హిందువులు, వీరిలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు.