తిరుగుబాటు తర్వాత.. మొదటిసారి ప్రిగోజిన్​తో పుతిన్ భేటీ

-

వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్​తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయినట్లు సమాచారం. రష్యాపై తిరుగుబాటు చేసిన తర్వాత ఈ భేటీ జరిగినట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ సోమవారం వెల్లడించారు.  జూన్‌ 24న రష్యా అధినేతపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం జరిగిన ఐదు రోజుల తర్వాత జూన్‌ 29న పుతిన్‌, ప్రిగోజిన్ భేటీ అయినట్లు దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగిందని ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో భాగంగా ఉక్రెయిన్‌ యుద్ధభూమిలో వాగ్నర్ గ్రూప్  చర్యలు, జూన్‌ 24 నాటి సంఘటనల గురించి పుతిన్‌ చర్చించినట్లు దిమిత్రి తెలిపారు. ‘తిరుగుబాటు యత్నానికి దారితీసిన పరిస్థితులను కమాండర్లు వివరించారు. అయితే తాము రష్యాకు ఎప్పటికీ సైనికులమేనని బలంగా చెప్పారు. మాతృభూమి కోసం ఉక్రెయిన్‌లో పోరాటాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు’ అని క్రెమ్లిన్‌ ప్రతినిధి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news