ఆ కండిషన్స్​కు ఉక్రెయిన్ ఓకే అంటే యుద్ధం ఆపేస్తాం : పుతిన్

-

ఉక్రెయిన్​తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో సంధికి రెడీ అంటూ ప్రకటన చేశారు. అయితే దీనికి ఆయన కొన్ని షరతులు విధించారు. అందులో ఒకటి మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ దళాలు వెళ్లిపోవాలని మాస్కో ప్రకటన జారీ చేసింది. మరోవైపు నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ ఇంకో కండిషన్ పెట్టారు పుతిన్. వీటికి అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు.

పుతిన్‌ ప్రకటనపై ఉక్రెయిన్‌ స్పందిస్తూ.. ఈ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ ధ్వజమెత్తింది. మరోవైపు అకారణంగా యుద్ధం ప్రారంభించిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందంటూ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టీన్‌ పేర్కొన్నారు. ఇది శాంతి ప్రతిపాదన కాదని.. తీవ్ర దాడికి, మరిన్ని ఆక్రమణలకు రష్యా దేశం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఉందని నాటో సెక్రటరీ జనరల్‌ స్టోల్టెన్‌ బెర్గ్‌ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version