రష్యా అధ్యక్ష బరిలో స్వతంత్ర అభ్యర్థిగానే పుతిన్‌

-

వచ్చే ఏడాదిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు అధ్యక్ష పీఠం ఎక్కిన వ్లాదిమిర్ పుతిన్కు ఐదోసారి పట్టం కట్టేందుకు రష్యన్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్ష పదవికి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఆయన మద్దతుదారులు ప్రతిపాదించారు. పార్టీ టికెట్‌పై కాకుండా అధ్యక్షునిగా ఇలా పోటీ చేయడానికి కనీసం 500 మంది మద్దతు అవసరమని రష్యా ఎన్నికల చట్టాలు చెబుతున్నాయి.

దీంతో పాటు 40 ప్రాంతాల నుంచి కనీసం 3 లక్షల మంది సంతకాలను సేకరించాల్సి ఉంటుందని రష్యా చట్టాలు పేర్కొంటున్నాయి. పుతిన్‌కు మద్దతు పలికినవారిలో అధికార ‘యునైటెడ్‌ రష్యా పార్టీ’ నేతలు, ప్రముఖ నటులు, గాయకులు, క్రీడాకారులు ఉన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్తో యుద్ధం వల్ల రష్యాలో పుతిన్కు మద్దతు మరింతగా పెరిగింది. ఈ ఎన్నికల్లోనూ ఆయనకే పట్టం కట్టేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇక పుతిన్‌ 2011లో నెలకొల్పిన రాజకీయ సంకీర్ణ కూటమి ‘పీపుల్స్‌ ఫ్రంట్‌’ ఏకగ్రీవంగా ఆయన్ని నామినేట్‌ చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news