క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ఆరోగ్య పరిస్థితి విషమం.. రాణి నివాసానికి చేరుకుంటున్న కుటుంబం

-

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) అనారోగ్యం క్షీణించినట్లు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. ప్రత్యేక వైద్య బృందం ఆమెను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లో ఉన్నఆమె కుటుంబ సభ్యులందరూ స్కాట్లాండ్‌లోని రాణి నివాసానికి చేరుకుంటున్నట్లు సమాచారం.

రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లో ఉంటున్న ఆమె.. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం నాడు సీనియర్‌ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితమే బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ స్కాట్లాండ్‌కి వెళ్లి రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్న సంగతి తెలిసిందే.

రాణి ఎలిజబెత్‌ 2 ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంపై బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ స్పందించారు. ఎలిజబెత్‌ ఆరోగ్యంపై తనతో పాటు యావత్‌ దేశం ఆందోళన చెందుతోందన్నారు. తనతోపాటు దేశ ప్రజలందరూ ఆమె కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news