బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భార్య, కుటుంబంతో కలిసి ఓ పార్క్‌కు వెళ్లిన ఆయన.. అక్కడి నిబంధనలను ఉల్లంఘించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వివాదానికి దారితీసింది.
అసలేం జరిగిందంటే..? శనివారం రోజున రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి కలిసి లండన్‌లోని హైడ్ పార్క్‌కు వెళ్లారు. తమ పెట్ డాగ్ ను కూడా తీసుకెళ్లారు. అయితే, ఆ పార్క్‌లో కుక్కలకు గొలుసు కట్టకుండా తిప్పడం నిబంధనలకు విరుద్ధం. రిషి సునాక్.. తన డాగ్ మెడకు ఎలాంటి బెల్టు కట్టలేదు. దీంతో ఆ పెట్ అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు రిషికి పార్కు నిబంధనలను గుర్తు చేశారు. స్పందించిన రిషి సునాక్ భార్య అక్షతామూర్తి. శునకానికి బెల్టు కట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో.. టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైంది. పార్క్‌లో శునకాలను అలా వదిలేయకూడదని చెప్పే సైన్ బోర్డ్ సైతం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
🚨 | BREAKING: Rishi Sunak was spoken to by the POLICE for letting his dog off the lead just yards away from a sign telling him not to do so pic.twitter.com/oHSNQECS8K
— Politics UK (@PolitlcsUK) March 14, 2023