Roshan Kanakala : హీరోగా యాంకర్ సుమ కొడుకు.. ఫస్ట్​ లుక్​ చూశారా

-

టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవాళ రోషన్ కనకాల పుట్టినరోజు సందర్భంగా అతడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. డీజేగా వైబ్రెంట్ అవతార్‌లో రోషన్ కనకాల కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో రోషన్ సన్ గ్లాసెస్‌తో డీజే సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ హెడ్‌సెట్ ధరించి కనిపించాడు.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ న్యూ ఏజ్ రోమ్- కామ్‌గా రూపొందుతోంది. మ్యూజిక్​ డైరెక్టర్​ శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తుండగా.. నవీన్ యాదవ్ కెమెరా‌మ్యాన్​గా పనిచేస్తున్నారు. రవికాంత్ పేరేపుతో పాటు విష్ణు కొండూరు, సెరి- గన్ని రచయితలు. వంశీకృష్ణ స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.

తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యాంకర్​ సుమ కనకాల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘నువ్వనుకున్నది జరుగుతోంది రోషన్. నీ కలలను ఆచరణలో పెట్టు. రవికాంత్ పేరేపు, శ్రీచరణ్ పాకాల పనిచేస్తున్న ఈ సినిమా ఒక అందమైన, వినోదాత్మకమైన ప్రయాణం కాబోతోంది. మా రోషన్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నో మధురానుభూతులు పొందుతున్న, కలలను సాకారం చేసుకుంటున్న ఈ ఏడాది నీకు ఎంతో ప్రత్యేకం’ అని సుమ కనకాల తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news