సిరియాపై రష్యా వైమానిక దాడులు.. 13 మంది మృతి

-

సిరియాపై రష్యా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారుల సహా 13 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. సిరియాలో ఇద్లిబ్‌ ప్రాంతంలోని తిరుగుబాటు వర్గాలపై అధ్యక్షుడు బషర్‌ అసాద్‌కు మద్దతిస్తున్న రష్యా ఆదివారం రోజున ఉదయం వైమానిక దాడులు జరిపింది. టర్కీ సరిహద్దుల్లోని జిస్ర్‌ అల్‌-షుగూర్‌ నగరంలోని కూరగాయల మార్కెట్‌పై జరిగిన ఈ దాడిలో సాధారణ పౌరులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

సిరియాలోని తిరుగుబాటుదారుల నియంత్రణలో ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై రష్యా యుద్ధ విమానాలు వైమానిక దాడులు జరిపాయి. ముస్లిం మెజారిటీ దేశమైన సిరియాలో ఈద్ అల్-అధాకు ముందు వస్తున్న ఈ ప్రాంతంలో వైమానిక దాడులు జరగడం ఇది రెండో సారి అని అధికారులు తెలిపారు. గత నాలుగు రోజులుగా ఫిరంగి కాల్పులు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

మరోవైపు రష్యాను ఒక రోజంతా కలవరపెట్టేలా చేసిన వాగ్నర్ గ్రూపు ఆ తర్వాత అకస్మాత్తుగా వెనక్కి తగ్గిపోయింది. అయినా ఆ పరిణామం మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నాయకత్వానికి సవాల్‌గానే భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news