ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు.. 48 మంది మృతి

-

ఉక్రెయిన్​-రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు చేస్తూ యుద్ధాన్ని ఆ దేశం వైపు మళ్లించింది. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఉక్రెయిన్​పై తాజాగా రష్యా దాడికి తెగబడింది. ఈ దాడుల్లో 48 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఖర్కీవ్ ప్రాంతంలోని హ్రోజా గ్రామంలో ఒక దుకాణం, కేఫ్​పై రష్యా బలగాలు గురువారం మధ్యాహ్నం దాడులు చేశాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 48 మంది మరణించారని.. మృతుల్లో ఆరేళ్ల బాలుడు కూడా ఉన్నాడని వెల్లడించారు. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. రష్యన్‌ రాకెట్‌ దాడి క్రూరమైన నేరమని.. ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన ఉగ్రవాద దాడి అని జెలెన్​స్కీ అన్నారు. మరోవైపు.. ఈయూ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి సాయం చేయాలని పాశ్చాత్య మిత్రదేశాలను అభ్యర్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news