ఏడడుగులు వేయకుంటే హిందూ వివాహం చెల్లదు: అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

-

హిందూ వివాహంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు ఇవ్వకుండా తనను వదిలేసిన భార్య ఇంకో వివాహం చేసుకుందని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏడడుగులు, ఇతర సంప్రదాయ తంతు నిర్వహించకుండా జరిగే హిందూ వివాహం చెల్లుబాటు కాబోదని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది.

తనకు విడాకులు ఇవ్వకుండా వదిలేసిన భార్య ఇంకో వ్యక్తిని వివాహం చేసుకుందని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. వధువు, వరుడు కలిసి నడిచే సప్తపది అన్నది హిందూ చట్టంలో అత్యంత ముఖ్యమైన తంతు అని.. ఫిర్యాదుదారు ఆరోపించినట్టుగా అలాంటిది జరిగినట్టు కన్పించడం లేదని కేసును విచారించిన జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అతడి పిటిషన్​ను కొట్టివేసింది.

స్మృతి సింగ్‌.. సత్యం సింగ్‌ అనే వ్యక్తి 2017లో వివాహమాడింది. భర్త వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన స్మృతి.. అతనిపై కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు భర్త సత్యం సింగ్‌, అత్తమామలపై కేసు నమోదు చేయగా.. తన భార్యే రెండో పెళ్లి చేసుకుని రివర్స్​లో తనపై కేసు పెట్టిందని సత్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు జరిపి అది అబద్ధమని నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news